జల వనరుల పరిరక్షణ సంస్థ అధిపతిగా… భారతీయ అమెరికన్

తమ దేశ జల వనరుల పరిరక్షణ సంస్థ అధిపతిగా భారత సంతతికి చెందిన జల వనరుల నిపుణురాలు రాధికా ఫాక్స్ ను అమెరికా సెనేట్ ఎన్నుకుంది. ఏడుగరు రిపబ్లికన్ సెనేటర్లు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచగా..55 ఓట్లకుగాను ఫాక్స్ కు 43 మంది ఓటు వేశారు. ఇద్దరు డెమొక్రాట్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. గత రెండు దశాబ్దాలుగా జల వనరులకు సంబంధించిన సమస్యలపై స్థానిక, జాతీయ స్థాయిలో పని చేసిన రాధిక.. వాటి పరిష్కారంలో విశేషమైన కృషి చేశారు. ఏప్రిల్ 14న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాధికను జలవనరుల సంస్థ సహాయ అధిపతిగా నామినేట్ చేశారు.