కెన్నెడీకి ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేయలేదు
ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లిక్ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ పేవరెట్‌గా ఉన్నారు. అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను ఆడిగినట్లు కెన్నెడీ ధవృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్ రన్నింగ్మేట్గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.






