బైడెన్ సర్కారుపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించిన తీరు చాలా అసమర్ధంగా ఉన్నదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఆప్ఘన్ గడ్డపై 20 ఏండ్ల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా బలగాల చిట్టచివరి విమానం కాబుల్ నుంచి బయలుదేరి అగ్రరాజ్యానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తీరుపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ పక్రియను తాను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదని బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్లో ఉన్న అన్ని అమెరికా సైనిక పరికరాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన 85 బిలియన్ డాలర్లతో ప్రతిపైసా తిరిగి తెచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాలిబన్లు సైనిక పరికరాలను తిరిగివ్వకపోతే మళ్లీ సైన్యాన్ని పంపాలని, లేదంటే బాంబులేసి వాటిని నాశనం చేయాలని సూచించారు. ఇలాంటి బలహీనమైన మూర్ఖత్వపు ఉపసహరణ పక్రియను ఎవరూ ఊహించలేదన్నారు.






