అది ప్రపంచ యుద్దానికి దారి తీస్తుంది : బైడెన్

ఉక్రెయిన్‌ను వెంటనే విడిచిపెట్టాలని తమ దేశ పౌరులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా, రష్యా దళాలు ఒకదానికొకటి ఘర్షణలకు దిగితే పెద్ద వివాదం ఏర్పడవచ్చునని హెచ్చరించారు. అమెరికన్ పౌరులు ఉక్రెయిన్‌ను ఇప్పుడే విడిచిపెట్టండి అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలతో ఒకదానితో వ్యవహరిస్తున్నామని, ఇది చాలా భిన్నమైన పరిస్థితి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు అంటూ బైడెన్ అన్నారు. 1,30,000 మంది రష్యా సైనికులు ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంతో డీల్ చేస్తున్నాము.
పరిస్థితి చాలా భిన్నమైనది. చాలా వేగంగా అదుపు తప్పిపోవచ్చు అని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనూ తాను ఉక్రెయిన్‌కు దళాలను పంపించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే అమెరికన్లను రక్షించేందుకు కూడా దళాలు పంపించబోనని బైడెన్ తెలిపారు. రష్యన్లు, అమెరికన్లు ఒకరిపై ఒకరు కాల్పులకు దిగితే అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. మనం ఇప్పుడు చాలా భిన్నమైన ప్రపంచంలో ఉన్నాం అని బైడెన్ పేర్కొన్నారు.