జో బైడెన్ కీలక ప్రకటన..
అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో బలగాల ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతసౌధంలలో బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్నారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 20 సంవత్సరాల తర్వాత బలగాలను వెనక్కి పిలిచేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని, అయితే ఊహించినదానికంటే వేగంగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైందన్నారు. అయితే, తనకు ఎలాంటి విచారణం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడతానన్నారు. ఈ నిర్ణయంపై చింతించడం లేదన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికా ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని తెలిపారు.






