ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఆహ్వానం
డిసెంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో నిర్వహించే ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం, పౌరసమాజం, ప్రైవేటు వ్యక్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ అజెండాను ముందుకు తెచ్చే విధంగా డిసెంబరు 9, 10 తేదీల్లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్వవస్థలు ఎదర్కొంటున్న ముప్పును సమిష్టి చర్యల ద్వారా నిలువరించే యత్నంగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ దీనిని అభివర్ణించింది.






