చరిత్రను మార్చేసిన అమెరికా నిర్ణయం
అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ హయాంలో అఫ్గానిపై సైనిక దాడులు చేపట్టినప్పుడు కేవలం తాలిబన్లను అధికారం నుంచి దించివేడయంపైనే అమెరికా దృష్టి పెట్టింది. అనంతరం ఆ దేశ పునర్ నిర్మాణం చేపట్టింది. లక్షల కోట్ల డాలర్లను ఆ దేశంలో ఖర్చు పెట్టింది. అఫ్గాన్‌లో ఎలాంటి సహజ వనరులు లేవు. వీటి ద్వారా అమెరికాకు ఎలాంటి ఆదాయమూ లేదు. అఫ్గాన్ నుంచి అమెరికా వెనక్కు మళ్లాలని పలువురు డిమాండ్ చేశారు. బుష్ జూనియర్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్లు అఫ్గాన్ వ్యవహారాలను పర్యవేక్షించారు. తాలిబన్ లకు పాక్‌తో పాటు చైనా, రష్యాలు ఆయుధాలను సరఫరా చేశామని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆర్థికంగా ఎలాంటి లాభదాయకం లేకపోవడంతో అమెరికా చివరకు తప్పుకుంది. ఫలితంగా తాలిబన్ లు దేశాన్ని తిరిగి తమ స్వాధీనం చేసుకున్నారు.






