క్లోర్యాడ్ లో జో బైడెన్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారుచిచ్చుతో నష్టపోయిన రాష్ట్రాలైన క్లోర్యాడ్లో పర్యటంచారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన కారుచిచ్చులు, తుఫాన్ల వల్ల 100 బిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని వెల్లడిరచారు. వాతావరణ మార్పుల వల్లే జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని అవసరమైన ఖర్చులు కూడా పెట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి రాష్ట్రాలు వరదలతో సతమతమౌతుంటే క్లోర్యాడ్ లాంటి రాష్ట్రాల్లోని అడవులలో ఏర్పడిన కారుచిచ్చుతో అల్లాడుతున్నాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా అపారంగా ఉన్నది. గత సంవత్సరం ఇదే పరిస్థితులలో 99 బిలియన్ డాలర్లు నష్టం జరిగినట్టు వెల్లడిరచారు.






