అణుయుద్ధానికి భయపడొద్దు : జో బైడెన్
అణు యుద్ధం గురించి భయపడవద్దని అమెరికా అధ్యక్షుడు దేశ ప్రజలను కోరారు. రష్యా అణ్వాయుధ దళాలను గరిష్ఠ సన్నధం చేస్తున్న క్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు భరోసా ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుబెదిరింపుల నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. అణుయుద్ధంపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారా? అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన లేదని బదులిచ్చారు. కాగా, రష్యా అణు బెదిరింపుల నేపథ్యంలో నాటో సభ్యదేశాలు అణ్వస్త్ర దళాలను అప్రమత్తం చేయావల్సి అవసరం లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ అన్నారు.






