లక్షా 75 వేల కోట్ల డాలర్లతో బైడెన్ ప్రణాళిక
బిల్డ్ బ్యాంక్ బెటర్ ప్లాన్ కోసం లక్షా 75 వేల కోట్ల డాలర్ల విలువ చేసే పన్నులు, వ్యయ ప్యాకేజీకి ఒక ప్రేమ్‌వర్క్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ సిద్ధం చేశారు. ఈ ప్రణాళికపై డెమొక్రాట్లను ఒప్పించేందుకు గాను బైడెన్ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై కేపిటల్ హిల్‌కు ఆయన ఈ నెల్లోనే రెండుసార్లు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే సెనేట్ ఆమోదించిన బైపార్టిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లుపై ఓటు వేయడంలో ఎగువ సభ విఫలమైనందుకు డెమోక్రాట్లు ఆగ్రహంతో వున్నారు. ఇప్పుడు తాజాగా రూపొందించిన బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్‌లో నూతన పర్యాటవరణ పరిరక్షణ, బాలల సంక్షేమానికి నిధులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, తక్కువ వేతనాలు కలిగిన కార్మికులకు విస్తృత రుణాలు వంటి ప్రతిపాదనలు పొందుపరచబడ్డాయి.






