ఇది ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య యుద్ధం
అమెరికా పార్లమెంటునుద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగంలో ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి నిరంకుశత్వానికి మధ్య యుద్ధం అని పేర్కొన్నారు. రష్యా చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంలో పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని అన్నారు. గంటన్నర పాటు సాగిన ఆయన ప్రసంగంలో పుతిన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రష్యాను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ప్రజల గొప్ప బలమైన గోడలా నిలిచారని అన్నారు. ఆయన గోడ గురించి ప్రస్తావించగానే ప్రచ్చన్న యుద్ధం నాటి బెర్లిస్ గోడ గుర్తుకొస్తుంది. బైడెన్ మాటలను బట్టి అమెరికా మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని మొదలెడుతుందా అన్న సందేహాన్ని పలువురు పరిశీలకలు వ్యక్తం చేశారు.






