బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్ లకు కీలక పదవులు
అమెరికా ప్రభుత్వంలోని రెండు కీలక పదవులకు మరో ఇద్దరు భారతీయ అమెరికన్లను ఎంపిక చేసినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అటార్నీ జనరల్, ఎగ్జిక్యూటివ్ పదవులకు ఇద్దరు భారతీయ అమెరికన్ మహిళలను నామినేట్ చేసినట్లు ప్రకటించారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన పరిపాలనలో చేరిన మీరాజోషి, రాధిక ఫాక్స్ లకు ఈ నామినేషన్ ల ద్వారా పదోన్నతి కల్పించారని వైట్ హౌస్ తెలిపింది. రవాణాశాఖలోని వాహనాల నియంత్రణ, భద్రత కార్యనిర్వాహకురాలిగా మీరా జోషి, నీరు, పర్యావరణ భద్రత సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా రాధికా ఫాక్స్ నామినేట్ అయినట్లు వైట్‌హౌస్ తెలిపింది.






