ముసలి ట్రంప్ వల్ల ఏమవుతుంది? : నిక్కీ హేలీ
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష నామినేషన్ కోసం బరిలో మిగిలిన డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ మధ్య హోరాహోరీ వాతావరణం నెలకొంది. ట్రంప్ ప్రచార బృందం హేలీని యుద్ధ పిపాసిగా వర్ణించగా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ను ఓడించడం ట్రంప్ వల్ల కాదని హెలీ ఎదురుదాడి చేశారు. ట్రంప్ సమయం, ధనం కోర్టు కేసులకే సరిపోతోందన్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం దాతలు విచ్చి విరాళాలలో 5 కోట్ల డాలర్ల 2023లో ట్రంప్ కోర్టు ఫీజులకే ఖర్చయిపోంది. అధ్యక్ష పదవి కోసం బరిలో ఉన్న ముసలివాళ్ల కన్నా తానే ఎన్నో రెట్లు మెరుగని ఓటర్లకు తెలుసని హెలీ వ్యాఖ్యానించారు.






