సెనేట్ లో జో బైడెన్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సెనేట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్మిగ్రేషన్ రిజిస్ట్రీ తేదిన మార్చే విషయంలో.. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1972 సంవత్సరానికి ముందు అమెరికా వచ్చిన వారినే రిజిస్ట్ట్రీ లో నమోదు చేస్తారు. ఈ సంవత్సరాన్ని 2010కి మార్చాలని బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రిజిస్ట్రీ తేదీని మార్చే అంశంపై సెనేట్‌లో ఏకాభిప్రాయం సాధించడానికి నియమించిన పార్లమెంటేరియన్ ఎలిజబెత్ మెక్డొనాఫ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ తేదీని మార్చడం అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి ప్రభుత్వ విధానాన్ని తిరస్కరిస్తున్నట్టు మెక్డొనాఫ్ ప్రకటించారు. అయితే మెక్డొనాప్ నిర్ణయాన్ని తాము ఆమోదించడం లేదని, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నామని అధికార డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.






