విషాదంలో జో బైడెన్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబానికి ఎంతో ఇష్టమైన జర్మన్ షెవర్డ్ శునకం చాంప్ (13) మరణించింది. వయో భారం కారణంగా డాగ్ చనిపోయినట్లు బైడెన్ కుటుంబం వెల్లడించింది. చాంప్ మృతి చెందిన విషయాన్ని అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మా ప్రియమైన చాంప్, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మేము నిన్ను ఎల్లప్పుడూ కోల్పోతాము అని సంతాపాన్ని తెలియజేశారు.