ఉక్రెయిన్ సరిహద్దులకు అమెరికా అధ్యక్షుడు
ఉక్రెయిన్ సరిహద్ధులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లారు. పోలెండ్ ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఓ పట్టణంలో ఆయన పర్యటించారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో తొలిసారి ఆయన ఉక్రెయిన్ సరిహద్దు పట్టణం వరకు వెళ్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలెండ్ తూర్పు ప్రాంతంలోని ర్జెసుఫ్కు ఎయిర్ ఫోర్స్ వన్లో ఆయన బయల్దేరి వెళ్లారని అధికార వర్గాలు ప్రకటించారు. నాటో బలగాలకు నైతిక స్థైర్యాన్వివ్వడంలో భాగంగానే ఆయన ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పట్టణానికి చేరుకున్నారని తెలిపారు. నాటోలో భాగమైన అమెరికా 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉక్రెయిన్లోని పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన నేపథ్యంలో రుమేనియా, హంగరీ, స్లొవేకియా, బల్గేరియాల్లో బలగాలను నాలో బలగాలను పెంచనుంది. కాగా ఇప్పటికే యద్దుంతో కోటి మందికిపైగా వేరే చోటికి తరలివెళ్లిపోయారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన మానవ సంక్షోభం వేధిస్తోంది.






