ఉపసంహరణ ఆగదు…మా బలగాలు అమెరికాకు
అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20 ఏళ్లకాలో దాదాపు రూ.74 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. 3 లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే అని బైడెన్ వ్యాఖ్యానించారు. దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్‌గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్టు తెలుస్తోంది.






