రష్యాకు వణుకుతున్న భారత్ : జో బైడెన్
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే భారత్ మాత్రం ఎందుకో కొంతమరకు భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్ రౌండ్ టేండ్ సమావేశంలో బైడెన్ మాట్లాడారు. నాటో కూటమిలో చీలిక తీసుకురాగలనని పుతిన్ లెక్కలు కూడా వేసుకున్నారని అన్నారు. నాటో కూటమి చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా, ఐక్యంగా ఉందని, ఇదంతా రష్యావల్లే అయిందనుకుంటున్నానని అన్నారు. పుతిన్ దురాక్రమణను అడ్డుకోవడంలో నాటో అమెరికా మిత్రదేశాలు, ఐరోపా సమాఖ్య ఆసియా భాగస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు. క్వాడ్ కూటమి లోనూ జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తుండగా, ఒక్క భారత్ మాత్రమే వణుకుతోందని అన్నారు.






