శబరిమల ఆలయంలో మహిళలు!
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో కొందరు మహిళా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ విషయంపై కేరళ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏండ్ల వయసున్న మహిళల ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ విషయంపై మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలపై విచారణ జరుపాలని అధికారులను ఆదేశించారు. కొల్లాం ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త వచ్చినప్పుడు అధికారులు ఆయనకు ప్రత్యేక వసుతులు కల్పించి, వీఐపీ దర్శనం చేయించారని ఆ వ్యాపారి, కొందరు మహిళలతో కలసి ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి. ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.













