ప్రధాని మోడీతో అమెరికా భద్రతా సలహాదారు భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్ మాస్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ చర్చించారు. దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులపై కూడా మాట్లాడుకున్నారు. అనంతరం ఎన్ఎస్ఏ అధికారి అజిత్ దోవల్ తో కూడా మెక్ మాస్టర్ భేటీ భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన సమావేశంలో విదేశాంగ కార్యదర్శి జయశంకర్ కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదం, ఇండో -యూఎస్ సహకారంపై రెండు దేశాలు చర్చించినట్లు అమెరికా ఎన్ఎస్ఏ పేర్కొన్నది. అమెరికా భద్రతా సలహాదారుడు మెక్‌మాస్టర్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా కలిశారు. షరీఫ్‌తో జరిగిన భేటీలో భారత్, పాక్ సంబంధాల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. పాక్, భారత్ కంటే ముందే మెక్‌మాస్టర్ ఆఫ్ఘనిస్తాన్లోనూ పర్యటించారు.













