దుబ్బాకలో ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆరో రౌండ్లో వెనుకంజ వేసింది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి 4062 ఓట్లు పోలవగా, బీజేపీకి 3709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దుబ్బాకలో ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 20,226, టీఆర్ఎస్కు 17,559, కాంగ్రెస్కు 3,254 ఓట్లు లభించాయి. ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 2,667 ఓట్లు. ఇప్పటి వరకు లెక్కించిన ఆరు రౌండ్ల ఓట్లు దుబ్బాక మండలం, పురపాలక సంఘం పరిధిలోనివి. ఇంకా 17 రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది.













