114 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది. 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరు కాలేదు.
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మాద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీని శుక్రవారం నాటికి వాయిదా వేశారు. ఎమ్మెల్మేలుగా 114 మంది ప్రమాణం చేశారు. బీజేపీ నేత రాజాసింగ్, ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.













