రేవంత్ కు భట్టి భయం.. కవిత సంచలన కామెంట్స్..!
తెలంగాణా జాగృతిలో(Telangana Jagruti) పలువురు నేతలు చేరిన సందర్భంగా.. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. రాసి పెట్టుకోండి…తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఏప్రిల్ 25 అంటూ.. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం అంటూ ప్రకటించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్(Congress), ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్న ఆమె. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించెదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం(ATM) గా మారిందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫోన్ చేసిన సరే రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడని, తెలంగాణ వస్తే స్వయంపాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడని, జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయే అన్నారు.
ఇవి కూడా చదవండి
అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని మెయింటెన్ చేస్తూ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటాం. వారితోనే కలిసి పనిచేస్తాం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం తెస్తామన్న ఆమె.. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించెదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోందన్నారు. రియల్ ఎస్టేట్, హైడ్రా పేరుతో బెదిరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీతో ఎందుకు నిలబడి మాట్లాడుతున్నావని తనతో పాటు సంచులు మోసిన వ్యక్తి అడిగితే…భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి రాహుల్ ఫిర్యాదు చేస్తానని.. చెబుతున్నాడంటని ఎద్దేవా చేసారు. అప్పుడు నాకు కుర్చీ, నీకు మోయటానికి సంచులు ఉండవని అతనితో ముఖ్యమంత్రి చెబుతున్నాడంట అని విమర్శించారు.
అంటే రాహుల్ గాంధీకి గులాంగిరి చేయకపోతే తన కుర్చీ కి ఎక్కడ ఎసరు వస్తుందోనని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి అడిగితే “నో” రాహుల్ జీ అని ఆయనకు సమాధానం చెబుతున్నాడని, కానీ కేరళ ఎన్నికలు, మనీ కావాలంటే మాత్రం “ఎస్” రాహుల్ జీ అంటూ గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే మనకు స్వయం పాలన వస్తుందని భావించాం.. కానీ ఢిల్లీ పాలన వచ్చిందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి








