పొన్నాల కు పౌల్ట్రీ లెజెండ్ అవార్డ్.. రేపు ప్రదానం
పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం.. మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు, తిరుమల హచరిస్ ఫౌండర్ ఛైర్మెన్ పొన్నాల లక్ష్మయ్య కు పౌల్ట్రీ లెజెండ్ అవార్డు దక్కింది. పౌల్ట్రీ ఇండియా 13వ ఎడిషన్ కార్యక్రమం రేపు మంగళవారం నాడు నోవాటేల్ హెచ్ ఐ సి సి లో జరగనుంది .
ఈ కార్యక్రమంలో పొన్నాలకు ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు. అమెరికాలో నాసా లో ఉద్యోగం చేస్తూ మాతృ భూమి పై మమకారంతో 1978లో దేశానికి తిరిగి వచ్చిన పొన్నాల తన గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని అందించాలన్న తాపత్రయం తొ స్వంతంగా 1978 లో తిరుమల హచరిస్ కోళ్ల పరిశ్రమను స్టాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పించారు.
అలాగే జనగామ ప్రాంతంలో పాడి పరిశ్రమ విస్తృతభివృద్ధికి కృషి చేసారు. నేడు తెలంగాణ లో కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ ఇంత పెద్దఎత్తున అభివృద్ధి చెందడంలో పొన్నాల పాత్ర ఎంతో ఉంది.
పొన్నాల ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించిన పౌల్ట్రీ ఇండియా సంస్థ ఈ ఏడాది పౌల్ట్రీ లెజెండ్ అవార్డ్ ఇవ్వనుంది.













