తెలంగాణలో ఎన్నికల వేళ… ఆసక్తికర పరిణామం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతల మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ రావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా పొన్నాల తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. అలాగే, ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలవాలని రాహుల్ టీమ్ ఆయనను కోరింది. ఈ నేపథ్యంలో పొన్నాల నిర్ణయంపై ఉత్కంఠ చోటుచేసుకుంది. ఆయన ఢిల్లీ వెళ్తారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.













