కామారెడ్డిలో కవిత
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ పక్రియను పరిశీలించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూతులో ఓటింగ్ సరళిని కవిత పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు. కాగా, నిజామాబాద్ డ్పి కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్, విజి గౌడ్. వినియోగించుకున్నారు.. 22 మంది కార్పొరేటర్లు తమ ఓట్లను సద్వినియోగం చేసుకున్నారు.













