ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
కరీంనగర్ పట్టణంలో బంద్ కొనసాగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ (BJP) దాడికి నిరసనగా కరీంనగర్ బంద్ కు బిఆర్ఎస్ (BRS) పిలుపునిచ్చింది. అయితే బిఆర్ఎస్ బంద్ కు కరీంనగర్ (Karimnagar) ప్రజలకు సంబంధమేంటని బీజేపీ ప్రశ్నించింది. బంద్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. బీజేపీ, బిఆర్ఎస్ దాడులు వారి వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పరస్పర భిన్న ప్రకటనల నేపథ్యంలో కరీంనగర్ లో ఉద్త్రిక్తత నెలకొంది. పోలీసులు (Police) భారీగా మోహరించి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలను అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ను గృహనిర్బంధం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బిఆర్ఎస్ శ్రేణులను ఉదయమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.








