కవిత్కక గెలుపు నిజామాబాద్ కు మళ్లీ పూర్వ వైభవం : మహేశ్ బిగాల
కవిత గెలుపు ఏకపక్షమని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 824 ఓట్లు ఉండగా అందులో 90 శాతం ఓటు కవితకే పడటం ఖాయమన్నారు. కోవిడ్ 19 ఉన్నా 24 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు బాండ్ పేపర్లు రాసి ఇచ్చి మోసం చేసిన వ్యక్తిని గెలిపించి ప్రజలు పొరపాటు చేశామని ఏడాది తరువాత ప్రజలు గ్రహించారన్నారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కవితక్క గెలుపు నిజామాబాద్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తుందన్నారు. అఖండ విజాయాన్ని సొంతం చేసుకోబోతున్న కవితకు మహేశ్ బిగాల ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు.













