కోదండ రామ్ తో షర్మిల కలిస్తే వచ్చే లాభం ఇదేనా…?
తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ప్రయాణం గురించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వైయస్ షర్మిల తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటారు లేకపోతే స్వతంత్రంగానే ముందుకు వెళ్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే విషయంలో తెలంగాణలో వైయస్ షర్మిల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవాలి అంటే అన్ని పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు లేవు అని చెప్పాలి. ఉప ఎన్నికల్లో ఓటమి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ పై ఇంకా తెలంగాణ ప్రజలలో ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు అనే వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు కొందరు.
అయితే ఇప్పుడు షర్మిల సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే సొంతగా ముందుకు వెళితే ఫలితం ఉండదు అనే భావనలో కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఒక కీలక అడుగు కూడా వేస్తే మంచిది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కోదండరాంతో కలిసి షర్మిల ముందుకు వెళితే మంచి ప్రయోజనాలు ఉండవచ్చు అనే భావనలో కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కోదండరాం తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని జిల్లాల మీద ఫోకస్ పెట్టారు.
టిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉండే ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటే భవిష్యత్తులో కొన్ని స్థానాల్లో తన ప్రభావం చూపించవచ్చు అనే భావన లో ఆయన ఉన్నారు. ఈ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సరే వాళ్ళు ఇతర పార్టీల నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్లే. అందుకే ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి షర్మిల ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు త్వరలోనే షర్మిల కోదండరాం తో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కోదండరాం తో కలిస్తే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కొంతమంది షర్మిల వెంట కూడా నడిచే అవకాశాలు ఉంటాయి.













