దుబ్బాక తొలి 4 రౌండ్లలో బీజేపీనే ఆధిక్యం …
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన తొలి నాలుగు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 2,648 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 13,055, టీఆర్ఎస్కు 10,371, కాంగ్రెస్కు 2,158 ఓట్లు పోలయ్యాయి. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో సృష్టం కానుంది.
కొవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.













