రాజకీయాల్లోకి రజనీ?
తమిళనాడులో జయలలిత మృతితో సూపర్‌స్టార్ రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం అంశం మరోసారి చర్చనీయంగా మారి మళ్లీ చల్లబడిన విషయం తెలిసిందే. అయితే, జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి వచ్చే నెల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న గంగై అమరన్ రజనీ కాంత్‌తో భేటీ కావడం మరోసారి ఆసక్తి రేపుతోంది. అమరన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సోదరుడు. గతంలో రజనీ కాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారా అనే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన అభ్యర్థి రజనీని కలవడం ఆసక్తి రేపుతోంది. మరో వైపు రజనీ కొత్త పార్టీ పెడతారని కొందరు భావిస్తున్నారు.













