ఈ నెల 26న హైదరాబాద్కు రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 26న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజున ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సచివాలయంలో సమన్వయ్య సమావేశం నిర్వహించారు. పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.






