జియోసైన్స్ అవార్డులు అందుకున్న తెలుగు శాస్త్రవేత్తలు
జియోసైన్స్‌లో విశేషంగా కృషి చేసిన వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులు అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మార్కండేయులు (గుంటూరు), రమేశ్‌బాబు(హైదరాబాద్)లు రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ జియోసైన్స్ 2016 అవార్డును అందుకొన్నారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. 25, 30 ఏళ్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పనిచేస్తున్నామని, కొత్త సాంకేతిక విజ్ఞానంతో వేర్వేరు ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు గుర్తించామని చెప్పారు. తమ కృషిని గుర్తించి అవార్డులను ఇచ్చిందనుకు ఆనందంగా ఉందన్నారు. తమతోపాటు బృందంలో చదుర్వేది, త్రిపాఠి అనే మరో ఇ్దదరు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారని, సమిష్టి కృషితోనే ఈ అవార్డును అందుకొన్నామన్నారు.













