జీఎస్టీకి రాష్ట్రపతి ఆమోదం
దేశమంతా ఒకే పన్ను విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుల విషయంలో మరో ముందడుగు పడింది. ఈ నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు ఉభయసభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రపతికి పంపగా, ఆయన ఆ నాలుగు బిల్లులను ఆమోదించారు. అయితే, కొత్త పన్నుల విధానం అమలులోకి రావాలంటే ఈ బిల్లులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపాల్సి ఉంది. జులై 1 నుంచి ఈ బిల్లును దేశంలో పూర్తిస్థాయిలో అమలుపరచాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా విశేష కృషిచేస్తోంది.













