ఆలస్యం చేస్తే బాదుడే!
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసేటపుడు ఇకమీదట జాగత్త్రగా ఉండాలి. ఏమాత్రం గొడవలు పడినా ఇక మీదట క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుల ప్రవర్తన కారణంగా విమానం గంట ఆలస్యమైతే రూ.5 లక్షలు, రెండు గంటలోపు అయితే రూ.10 లక్షలు, రెండు గంటలు దాటి ఆలస్యమైతే రూ.15 లక్షల జరిమానా విధించాలని ఎయిరిండియా భావిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రయాణికులు అనుచిత ప్రవర్తన, ఎయిరిండియా ఉద్యోగుల మీద దాడులు చేయడం (వీవీఐపీలు గానీ, మామూలు ప్రయాణికులు గానీ) లాంటి ఘటనల వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం బాబా దెబ్బతిందని, చివరకు హోటల్లో కూడా ఎవరు రావాలి, ఎవరు రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం ఉన్నప్పుడు ఎయిరిండియాకు కూడా ఇలాంటి అనుచిత ప్రవర్తన కలిగిన ఉండే ప్రయాణికుల విషయంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని ఓ అధికారి చెప్పారు.













