పీజీ సీట్లలో ఎన్ఆర్ఐ కోటా
ఈ ఏడాది నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్ల భర్తీని కామన్ కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టాలని భారత వైద్య మండలి నిర్ణయించింది. దీనిని ప్రైవేట్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్వామ్నాయంగా మేనేజ్మెంట్ సీట్ల ఫీజులను భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలాగే కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పీజీ సీట్లల్లో ఎన్ఆర్ఐ కోటా ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. ఈసారి పీజీ వైద్య సీట్లలోకూడా ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.













