వైఎస్సార్ జయంతి.. ఇకపై ఏపీలో రైతు దినోత్సవం
దివంగత నేత, ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవం గా ప్రకటిస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత నేత, ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రైతుల సమక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ దివంగత నేత స్మారకంగా ప్రతి ఏడాది జులై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం.













