తప్పులు చేసిన నాయకులే ఆయన్ను… ఈ కేసులో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబు వేధిస్తోంది. జైలులో ఆయన సంతోషం లేరు. పార్టీ కార్యకర్తల గురించి అడిగారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్ర అభివృద్ధి చెందింది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం గురించే ఆలోచిస్తారు. ఆయన అరెస్ట్‌ను అనేకమంది జాతీయ నేతలు ఖండించారు. సంఫీుభావం తెలిపిన జాతీయ నేతలకు కృతజ్ఞతలలు చెప్పమన్నారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటాం. చంద్రబాబు గదిలో ఏసీ లేదు. ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ గదిలో దోమలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.













