కేంద్రం నుంచి నిధుల కోసం.. చంద్ర బాబు స్ప్రాటజీ మారుస్తారా?
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా గడవకముందే వరుస ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ముఖ్యంగా బుడమేరు వరదతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నీట మునిగిన వారికి సదుపాయాలు కల్పించడంతోపాటు ఇళ్లను శుభ్రం చేయించడం, విద్యుత్ పునరుద్ధరించడం, రోడ్స్ క్లీన్ చేయించడం లాంటి ఎన్నో పనులకు ప్రభుత్వం లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఒక సమస్య నుంచి పూర్తిగా బయటపడక ముందే మరొకపక్క ఏలేరు రిజర్వాయర్ కి పోటెత్తిన వరద 62 గ్రామాలలో అదే సీన్ రిపీట్ అయ్యేలా చేస్తుంది.
వరద ప్రాంతాలలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడం తో చంద్రబాబు ఎక్కడ పర్యటనకు వెళ్లిన ఆదుకోమనే వారే కనిపిస్తున్నారు. ఎంత అనుభవం ఉన్న నాయకుడికైనా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం కాస్త కష్టతరమే. పైగా ఇప్పటికే వైసిపీ ఖజానా ఖాళీ చేసింది అని బాబు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కష్టంలో ఉన్నవారికి మాటలు చెబితే అర్థం కాదు.. వాళ్లకు సహాయం మాత్రమే అవసరం. దీనికోసం కేంద్రం నుంచి నిధులు వెంటనే రావాలి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహాన్ని కాస్త మార్చుకుంటే నిధులు ఫాస్ట్ గా వస్తాయి అంటున్నారు పరిశీలకులు. కేంద్రంలో చంద్రబాబు పొత్తు ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అనేక సందర్భాలలో ఆయన ఢిల్లీకి కూడా పర్యటించారు. చంద్రబాబు కోసం పోలవరానికి నిధులు, అమరావతి నిర్మాణం వంటి వాటి పై కేంద్రం పాజిటివ్‌గా స్పందించింది అని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు ఈసారి ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోకపోతే రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో ఏమి చేయలేదు మాట్లాడుకుంటారు.
అందుకే చంద్రబాబు చేతిలో ఉన్న 15 మంది ఎంపీలు, మిత్రపక్షమైన జనసేనలో ఉన్న ఇద్దరు ఎంపీలు, బీజేపీ నలుగురు ఎంపీలతో కలిసి చంద్రబాబు ఢిల్లీలో బయటైస్తే తప్ప నిధులు త్వరగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి బృందాలు వచ్చి.. ఇక్కడ పరిస్థితి పర్యవేక్షించి ,సిఫార్సు చేసి నిధులు తీసుకువచ్చేంత సమయం కూడా లేదు. ప్రస్తుతం ప్రజలలో మెల్లగా ప్రబలుతున్న అసంతృప్తి తీవ్రరూపం దాల్చకముందే చంద్రబాబు నిధులు సమకూర్చుకునే పనిలోకి దిగాల్సి ఉంటుంది. మరి ఈ టైం లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి













