చంద్రబాబుకు సీఎం రేవంత్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని కోరారు.