చంద్రబాబు నాయుడుతో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన భేటీ
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘ చర్చలు జరిపారు ఎన్నారైల మద్దతు చంద్రబాబు కోరడంతో తెలుగుదేశం పార్టీ 2024 లో అధికారం ఏర్పడటానికి ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తామని సతీష్ వేమన వెల్లడించారు ఎన్నారైల మద్దతు కావాలని చంద్రబాబు కోరడంతో జరగబోవు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల కు ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తామని సతీష్ వేమన తెలిపారు అందుకు ప్రత్యేకంగా ఎన్నారై లకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.







