జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీం ఆదేశం.. 24 గంటల్లో
వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ తమ పాస్‌పోర్టులను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేవిశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ చేపట్టింది. 3 వారాలపాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిది. నిందితులు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది.













