టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సతీష్ వేమన
అమెరికాలో తెలుగు కమ్యూనిటీలో ప్రముఖ వ్యక్తిగా, తానా మాజీ అధ్యక్షుడిగా, ఎన్నారై టీడిపి నాయకునిగా ఉన్న సతీష్ వేమనను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈమేరకు నియామక ప్రకటనను విడుదల చేశారు. రాయలసీమ ప్రాంతం రైల్వే కోడూరుకు చెందిన సతీష్ వేమన నియామకంపై పలువురు ఎన్నారైలు, ప్రముఖులు, టిడిపి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ టీడీపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.







