ఎన్ఆర్ఐ విద్యార్ధిని రూ.2.16 లక్షల విరాళం
అమెరికాలోని మాడిసన్లో విద్యను అభ్యసిస్తూ, ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం.సాయి సుష్మ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.16 లక్షల విరాళాన్ని ఇచ్చారు. తిత్లీ తుపాను బాధితులకు మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే తను దాచుకున్న డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. రెండు పదుల వయస్సులోనే ఇంత పెద్ద మొత్తంలో ఆపన్నులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సుష్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక అభినందన లేఖకు సుష్మ మెయిల్‌కు పంపారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు విదేశాల్లో ఉన్న మిగిలిన తెలుగువారు కూడా ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.













