ఎన్నికలు పూర్తయితేనే.. వ్యాక్సినేషన్ వేగంగా
కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జ్యాపంపై గవర్నర్, హైకోర్టుకు నివేదించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యాక్సినేషన్‌కు గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని చెప్పారు. నూరుశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేలా చూడాలన్నారు.













