2019 నాటికి లక్ష ఐటి ఉద్యోగాలు
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ మూర్తి శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2019కల్లా రాష్ట్రంలో లక్షమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేక పాలసీ ద్వారా ఐటీ కంపెనీలకు 50 శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. విశాఖలో 20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించేందుకు ఉడా తరపున చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.













