మంత్రి నారా లోకేశ్ కు డిజిటల్ లీడర్ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ ”డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్” పురస్కారం ప్రకటించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో దేశవ్యాప్తంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని మంత్రి లోకేశ్‌కు ఈ అవార్డు ప్రకటించిందని ఐటీశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి మరో అవార్డు లభించిందని వెల్లడించింది. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సదస్సులో మంత్రి పురస్కారం అందుకోనున్నారు.













