డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీ, డ్యాష్‌బోర్డు ఏర్పాటు ఆధారంగా బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ ఈ అవార్డులు ప్రకటించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో వివిధ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా లోకేశ్‌కు ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్‌లో లోకేశ్ రాజస్థాన్ పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి రాజ్‌పాల్ సింగ్ షెకావత్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మరోవైపు జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం వినియోగిస్తున్న ఆధునాతన ట్రాకింగ్ సిస్టమ్‌కు కూడా అవార్డు వచ్చింది.













