మంత్రి లోకేష్ కి అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కి సింగపూర్ ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్ ప్రభుత్వం అందించే ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్‌కు లోకేశ్ ఎంపికయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన వంటి అంశాల ఆధారంగా ఇతర దేశాలకు చెందిన నాయకులకు సింగపూర్ ప్రభుత్వం ఫెలోషిప్ అందిస్తోంది. సంవత్సరం పాటు మంత్రికి ఈ ఫెలోషిప్ అందించనుంది. సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీవీఎన్ బాలకృష్ణన్ ఈ మేరకు లేఖ ద్వారా తెలియజేశారు. డిసెంబరు చివరివారంలో సింగపూర్‌లో పర్యటించనున్న మంత్రి లోకేశ్ ఈ ఫెలోషిప్‌ను అందుకుంటారు.













