బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు : మంత్రి జోగి రమేష్
బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏఎస్పేట ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని, టీడీపీ ఆరిపోయే దీపం లాంటిందని అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటు అన్నారు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చాడు. గాంధీ కలలకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం పయనిస్తోందని అన్నారు.













